'బాహుబలి' సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయి చాలా రోజులే అయ్యింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంకో వైపున రాజమౌళి మళ్ళీ పిలిస్తే, మీరేమంటారు? అన్న ప్రశ్నకు ప్రతి ఒక్కరిదీ ఒకటే సమాధానం. రాజమౌళి అడగాలేగానీ, వద్దంటామా! అని హీరో ప్రభాస్, హీరోయిన్లు అనుష్క, తమన్నా, విలన్‌గా నటించిన రాణా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించిన రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు అంటున్నారు. రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, దేశం గర్వించదగ్గ దర్శకుడిగా రాజమౌళి 'బాహుబలి'తో కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు. రాజమౌళితో సినిమా చేస్తే స్టార్‌డమ్ మాత్రమే కాదు, అంతకు మించిన గుర్తింపు లభిస్తుంది. సత్యరాజ్ హీరోగా ఎన్నో తమిళ సినిమాల్లో నటించాడు. కానీ అతను 'కట్టప్ప' పాత్రతోనే తనకు దేశవ్యాప్త గుర్తింపు లభించిందని చెబుతాడు. ఎవరైనా ఇదే మాట చెప్పడం మామూలే. అయితే రాజమౌళి మాత్రం, ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. నటీనటులు, టెక్నీషియన్లు, ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ 'బాహుబలి' ఘనతో భాగస్వాములేనని అన్నాడు. వారు లేకుండా 'బాహుబలి'గానీ, తనకు ఈ స్థాయి గుర్తింపుగానీ లేనే లేవని రాజమౌళి చెప్పడం గమనించదగ్గ అంశం.