2023 టాలీవుడ్ కళకళలాడిపోయింది. చాలామంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకొన్నారు. సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే.. ఇప్పటికీ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు. వాళ్ల పెళ్లి కబురు మాత్రం ఇంకా అభిమానులకు అందలేదు. కనీసం 2024లో అయినా వాళ్లు పెళ్లి చేసుకొంటారా? అభిమానులకు ఆ శుభవార్త చెబుతారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ప్రభాస్. తన పెళ్లి గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పెదనాన్న కృష్ణంరాజు తన వంతు ప్రయత్నాలు చేశారు. 2023లో కచ్చితంగా ప్రభాస్ పెళ్లి జరుగుతుందని చెప్పారు. కానీ ఆయన కాలం చేశారు. దాంతో ప్రభాస్ పెళ్లి గురించి పట్టుబట్టేవాళ్లే లేకుండా పోయారు. ప్రభాస్ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. పెళ్లి చేసుకొనేందుకు ఇదే అనువైన సమయం కూడా. అందుకే ఈయేడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకొంటాడేమో అని అభిమానులు ఆశ పడుతున్నారు.
అనుష్క పెళ్లీడు కూడా దాటి పోతోంది. ఓ వైపు తను సినిమాలు తగ్గించేసుకొంది. ఎప్పుడైతే సినిమాలు తగ్గించిందో, అప్పటి నుంచీ అనుష్క పెళ్లిపై రకరకాల వార్తలొచ్చాయి. కానీ అనుష్క మనసు మాత్రం కరగలేదు. కనీసం 2024లో అయినా స్వీటీ పెళ్లి వార్త చెబుతుందేమో చూడాలి. త్రిష, శ్రుతి హాసన్‌లు కూడా ఇప్పటికీ బ్యాచిలర్లుగానే ఉండిపోయారు. త్రిష కెరీర్ ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకొంటే.. తన జీవితంలో మరో మెట్టు ఎదిగినట్టే. కానీ పెళ్లిపై త్రిష అస్సలు స్పందించడం లేదు. శ్రుతి కథ వేరు. తనకు ఆల్రెడీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తను సహజీవనంలో ఉంది. పెళ్లి అనేది ఓ తంతు మాత్రమే. మరి.. శ్రుతి పెళ్లి చేసుకొంటుందో లేదో చూడాలి. సమంత రెండో పెళ్లి దాదాపు అసాధ్యమే. ఎందుకంటే.. విడాకులైన తరవాత మళ్లీ పెళ్లి చేసుకొంటే, ఆ కాపురాలు సవ్యంగా సాగడం లేదని ఇటీవల డేటాతో సహా బయటపెట్టింది సమంత. సో.. తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేనట్టే.