2009లో విడుదలైన ప్రభాస్ `బిల్లా` మంచి హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని 4 K టెక్నాలజీతో రీ రీలీజ్ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఈమధ్య అగ్ర హీరోల పుట్టిన రోజున, ఫ్యాన్స్ స్పెషల్ షోలతో హంగామా సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆమధ్య మహేష్ బర్త్ డేన `పోకిరి` రీ రిలీజ్ చేశారు. పవన్ పుట్టిన రోజున `జల్సా`ని రిలీజ్ చేస్తున్నారు. అక్టోబరు 23 ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `బిల్లా`ని 4 K ప్రింటుతో రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు మొదలెట్టారు.
నిజానికి బిల్లా కంటే బుజ్జిగాడు సినిమా బాగుంటుంది. అందులో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కానివాళ్లు సైతం.. బుజ్జిగాడులో ప్రభాస్‌ని చూపి ప్రేమించడం మొదలెడతారు. పైగా ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అందుకే బిల్లా కంటే, బుజ్జిగాడుని కొత్తగా రిలీజ్ చేస్తే ఇంకాస్త ఆదరణ ఉండేది. అయితే బుజ్జిగాడు ప్రింట్ అందుబాటులో లేదని, బిల్లా ప్రింటు దొరికిందని, అందుకే దాన్ని 4 K లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఈలోగా బుజ్జిగాడు ప్రింటు కూడా దొరికేస్తే.. అప్పుడు బిల్లాతో పాటు బుజ్జిగాడునీ విడుదల చేస్తారు.