`ఆర్.ఆర్.ఆర్` తరవాత రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు తన కెరీర్‌ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మంచి లైనప్‌ని సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే శంకర్ సినిమా ఓకే చేశాడు. ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎలాంటి సినిమా రావాలనుకుంటున్నాడో, అలాంటి సినిమా ఇది. శంకర్ తరవాత కూడా భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నాడు.
నిజానికి.. `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సివుంది. శంకర్ సినిమాతో పాటుగా ఇది కూడా సమాంతరంగా తెరకెక్కాలి. కానీ.. ప్రస్తుతానికి ఈ సినిమా లేనట్టే అని టాలీవుడ్ టాక్. గౌతమ్ తో సినిమా చేయాలని చరణ్ ఆశ పడినా, కథ లాక్ అవ్వడం లేదని, ఎన్ని వెర్షన్లు చెప్పినా చరణ్ సంతృప్తి వ్యక్తపరచడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త దర్శకులతో సినిమాలు చేసి, రిస్క్ తీసుకోవడం చరణ్‌కి ఇష్టం లేదని, అందుకే గౌతమ్ కి సున్నితంగా చెప్పి, ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నాడని టాక్. నిజానికి గౌతమ్ ఈ కథ చాలామంది హీరోలకు చెప్పాడు. ఎవరికీ నచ్చలేదు. చరణ్ మాత్రం కొన్ని మార్పులూ, చేర్పులూ సూచించాడు. కానీ.. గౌతమ్ అవి కూడా చేయలేకపోవడంతో ఈ ప్రాజెక్టుని వదులుకోవాల్సివచ్చింది.