ఎప్పుడెప్పుడు పప్పన్నం పెడతాడా? అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఆయన పెదనాన్న కృష్ణంరాజు కూడా తెలిపారు. కానీ, 'బాహుబలి' తర్వాత 'సాహో'తో బిజీ అయిపోయాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ సినిమాతో బిజీ అయిపోతాడు. మరి పెళ్లి మాటేంటీ? ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా ఆయన్ని చుట్టుముట్టే ప్రశ్నల్లో ముందుగా ఉండేది. పెళ్లెప్పుడు? అనే ప్రశ్న.
ఆ తర్వాత అనుష్కతో రిలేషన్ షిప్ సంగతేంటీ? అనే ప్రశ్న. అయితే, అనుష్కతో తన రిలేషన్ షిప్‌పై ప్రభాస్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. కానీ, ఓ వైపు అనుష్క పెళ్లికి సిద్ధం కావడం లేదు. మరోవైపు ప్రభాస్ కూడా పెళ్లి మాట ఇట్టే దాటేస్తున్నాడు. వీరి మధ్య స్నేహం బలమైనది.. అని అందరికీ తెలిసిందే. స్నేహం, ప్రేమగా, ప్రేమ, పెళ్లిగా మారడంలో తప్పేముంది.? అనేది అభిమానుల అభిప్రాయం. అయితే, లేదు మొర్రో మా మధ్య పెళ్లి చేసుకునేంత సినిమా లేదు.. అంటూ వీరిద్దరూ ఎప్పటికప్పుడే మొత్తుకుంటున్నారు.