తమిళ హీరో విశాల్ వివాహం ఆగిపోయిందంటూ తాజాగా ఓ గాలి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలల క్రితం హైద్రాబాద్ అమ్మాయి అనీశాతో విశాల్ నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం తర్వాత త్వరలోనే వివాహ ముహూర్తం ఫిక్స్ కానుందని ప్రకటించారు కూడా. అయితే, ఆ మాటలే ఎక్కడా వినిపించడం లేదు.. సరికదా.
అనీశా తన ట్విట్టర్ ఖాతాలో నుండి, నిశ్చితార్ధంకు సంబంధించిన ఫోటోలు, విశాల్‌తో కలిసి సరదాగా దిగిన కొన్ని ఫోటోల్ని ఎందుకో డిలీట్ చేసేసిందట. ఈ కారణంతో, వీరి మధ్య ఏవో డిఫరెన్సెస్ వచ్చాయనీ, దాంతో వీరి వివాహం రద్దయ్యిందనీ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇలాంటి గాలి వార్తల్ని స్ప్రెడ్ చేయడంలో మన నెట్టిల్లు ఎప్పుడూ ముందుంటుందనుకోండి అది వేరే విషయం. మరి, ఈ గాసిప్స్‌లో అసలు నిజమెంత.? ప్రస్తుతం విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలోనే నిశ్చితార్ధం చేసుకున్నాడు.
అలాంటిది సినిమాల కారణంగా వివాహం రద్దు చేసుకోడు. మరి, అనీశా, విశాల్ మధ్య ఏం జరిగింది.? ఎందుకు వివాహం ఆలస్యమైంది.? నిప్పు లేనిదే పొగ రాదంటారు.. కదా. ఈ నిప్పు ఎందుకు పుట్టింది.? పొగ ఎక్కడి నుండి రాజింది.? అనేది తెలియాలంటే, ఇష్యూ విశాల్ చెంతకి చేరాల్సిందే. విశాల్ రెస్పాండ్ అవ్వాల్సిందే.