'సాహో' నుండి లేటెస్ట్‌గా సాంగ్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ రెస్పాన్స్ గురించి కాస్సేపు పక్కన పెడితే, ఇంతవరకూ 'సాహో' ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ చేసిన హడావిడికి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమా కదా. ప్రమోషన్స్‌లో కూడా అంతే భారీతనం ప్రదర్శించారు. ఆ భారీతనానికి కావల్సిన భారీ రెస్పాన్స్ కూడా ఆడియన్స్ నుండి గెయిన్ చేశారు.
ఇక ఇప్పుడు తాజా టీజర్ చర్చకొచ్చేద్దాం. 'సైకో సయ్యా..' టీజర్‌కి పోజిటివ్ రెస్పాన్స్ కన్నా, నెగిటివ్ రెస్పాన్సే ఎక్కువగా వినిపిస్తోంది. టీజర్ ఆశించిన రీతిలో లేదనీ, ఫ్యాన్స్ డిజిప్పాయింట్ అవుతున్నారు. యాక్షన్ మోడ్ వీడియోలకు ఇంతవరకూ ఓ మోస్తరు బజ్ వచ్చింది. అయితే, తాజా టీజర్ వచ్చాక అవి కూడా చప్పబడిపోయాయన్న అభిప్రాయం అభిమానుల్లో కలుగుతోందట. ఈ ఫీలింగ్ నుండి ఫ్యాన్స్‌ని బయటికి తీసుకురావాలంటే, 'సాహో' టీమ్ మరో మంచి స్టఫ్ ఉన్న వీడియోని 'సాహో' నుండి వదలాల్సి ఉంటుంది.
ఈ రెస్పాన్స్‌తో త్వరలో రానున్న ఈ సాంగ్ ప్రోమో అయినా బ్రైట్‌గా ఎట్రాక్టివ్‌గా కట్ చేస్తారేమో సాహో టీమ్ చూడాలి. హాలీవుడ్ టెక్నీషియన్లు, భారీ బడ్జెట్, బాలీవుడ్ నటీనటులు.. ఇంత హంగామాతో రూపొందుతోన్న 'సాహో' ప్రోమో కటింగ్‌పై యూనిట్ ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ ప్రబాస్‌కి సూచిస్తున్నారట. అంతేకాదు, యంగ్ డైరెక్టర్ సుజిత్‌కి 'సాహో' ప్రెస్టీజియస్ మూవీ. ఆ ప్రెస్టీజ్‌ని కాపాడుకోవాలంటే, 'సాహో'తో గట్టి హిట్ కొట్టి తీరాలి. 'బాహుబలి' వంటి సినిమా తర్వాత కూడా కమిట్మెంట్‌కి వేల్యూ ఇస్తూ, ఇచ్చిన మాట ప్రకారం సుజిత్‌తోనే సినిమాకి ఓకే చేసిన ప్రబాస్ నమ్మకాన్ని కూడా సుజిత్ నిలబెట్టుకోవాలి. ఇవన్నీ జరగాలంటే, కంటెంట్‌తో సంబంధం లేకుండా, ప్రబాస్ కటౌట్‌ని బాగా యూజ్ చేసుకోవాలి. అదిరిపోయే స్టిల్స్ అయినా రిలీజ్ చేయాలి. లేదంటే, ప్రమోషన్స్‌లోనూ పస పెంచాలి.