సీతారామం కోసం ప్ర‌భాస్ ఆగ‌మ‌నం

మరిన్ని వార్తలు

సీతారామం ప్ర‌మోష‌న్లు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఎక్క‌డ చూసినా సీతారామం హంగామానే క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సీతారామం టీమ్ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తోంది. నెల రోజుల ముందు నుంచే ప్ర‌మోష‌న్ల‌ని మొద‌లెట్టిన వైజ‌యంతీ మూవీస్‌.. ఇప్పుడు వీటికి ఘ‌న‌మైన స్థాయిలో ఫినిషింగ్ ట‌చ్ ఇవ్వ‌బోతోంది. పాన్ ఇండియా స్టార్‌.. బాహుబ‌లి... ప్ర‌భాస్‌ని సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించి - అంద‌రి దృష్టినీ ఈ సినిమా వైపుకు తిప్పుకొనేలా చేయ‌బోతోంది. వైజ‌యంతీ మూవీస్ అంటే ప్ర‌భాస్ కి విప‌రీత‌మైన అభిమానం. ప్ర‌భాస్ న‌టిస్తున్న అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రం.. ప్రాజెక్ట్ కె.. వైజ‌యంతీ మూవీస్‌నే నిర్మిస్తోంది. ఆ అనుబంధంతో ప్ర‌భాస్ ఈ ఈవెంట్ కి వ‌చ్చి `సీతా రామం` టీమ్‌కు త‌న బెస్ట్ విషెష్ చెప్ప‌బోతున్నాడు.

 

సీతారామం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప్ర‌భాస్ క‌నిపిస్తాడ‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. కానీ... మ‌న‌సులో ఎక్క‌డో చిన్న డౌటు ఉండేది. ప్ర‌భాస్ అటు స‌లార్‌, ఇటు ప్రాజెక్ట్ కె షూటింగు ప‌నుల్లో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నాడు. క్ష‌ణం కూడా తీరిక ఉండ‌డం లేదు. పైగా.. ఈమ‌ధ్య బ‌య‌ట ఫంక్ష‌న్ల‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌డ‌మే మానేశాడు. దాంతో.. `సీతారామం` ప్రీ రిలీజ్‌కి ప్ర‌భాస్‌వ‌స్తాడా, రాడా? అనే డౌటు మొద‌లైంది. అయితే ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌భాస్ వ‌స్తున్నాడ‌న్న వార్త‌... రెబ‌ల్ స్టార్ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. నెల రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా సాగుతున్న సీతారామం ప్ర‌మోష‌న్ల‌కు ప్ర‌భాస్ ఎంట్రీతో...ఓ గొప్ప ఫినిషింగ్ ట‌చ్ ప‌డ‌బోతోంది. ఈ ఈవెంట్ ఎక్క‌డ‌, ఎప్పుడు నిర్వ‌హిస్తార‌న్న విష‌యాలు అతి త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS