'సైరా' కోసం ప్ర‌భాస్ వ‌స్తున్నాడు.

By Gowthami - September 24, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఓ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డానికి మ‌రో హీరో ముందుకు వ‌స్తున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల‌లో పాల్గొని - ఆయా చిత్రాల‌కు మైలేజీ పెంచుతున్నారు. తాజాగా `సైరా` ప్ర‌చారం కోసం ప్ర‌భాస్ రంగంలోకి దిగ‌బోతున్నాడు. చిరంజీవి న‌టించిన 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. అక్టోబ‌రు 2న రాబోతోంది.

 

ఈ సినిమా కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టారు. ప్ర‌చారాన్నీ చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌భాస్‌ని రంగంలోకి దింపుతున్నాడు చ‌ర‌ణ్‌. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను ప్ర‌భాస్ ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఇంట‌ర్వ్యూ వీడియోని ఆ త‌ర‌వాత ఆన్ లైన్‌లో విడుద‌ల చేస్తారు. ఆ ఫుటేజీని టీవీ ఛాన‌ళ్ల‌కూ అందిస్తారు. ఆ విధంగా ప్ర‌భాస్ కూడా సైరా కోసం సాయం చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. రాజ‌మౌళి తో కూడా ఓ ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS