ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రెండు భారీ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్నాయి. వాటిలో ఒకటి మన మెగాస్టార్ 'చిరంజీవి' నటించిన 151వ చిత్రం 'సైరా నరసింహరెడ్డి' కాగా మరొకటి బాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరోస్ 'రితిక్ రోషన్' మరియు 'టైగర్ ష్రాఫ్' కలిసి నటించిన 'వార్'. ఈ రెండు చిత్రాల డేట్ క్లాష్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగనుంది. అంతేకాకుండా ఇండియాలోని అన్నీ ప్రముఖ భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్నాయి.
అయితే సై రా టీం మొదటి నుండే ప్లాన్ చేసి మరీ వివిధ ఇండస్ట్రీల నుండి అమితాబ్ బచ్చన్, సుదీప్ మరియు విజయ్ సేతుపతి లాంటి ప్రముఖ నటీనటులను ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నారు. ఇది ఓపెనింగ్స్ విషయంలో ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. మరోవైపు 'వార్' చిత్రం యొక్క ప్రమోషన్స్ చూస్తుంటే ప్రేక్షకుల్లో ఆ చిత్రం పై కూడా భారీ అంచనాలే ఉన్నట్టు తెలుస్తుంది . నార్త్ లో ఎలాగూ వార్ కి కావాల్సినంత క్రేజ్ ఉంది అలాగే సౌత్ లో కూడా ముల్టీప్లెక్సుల్లో భారీగా విడుదల కానుందని సమాచారం.
ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ కు అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన లభించింది. మెగా స్టార్ కు ధీటుగా తెలుగు మరియు తమిళ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు 'వార్' చిత్ర బృందం. ఇదిలా ఉండగా గత నెలలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయిన ప్రభాస్ సాహో అంచనాలను అందుకోలేకపోయింది అని చెప్పొచ్చు, మరి ఆ ఎఫెక్ట్ సైరా' పై ఎంతవరకు ఉంటుందో చూడాలి. అయితే 'వార్' తో తలపడుతున్న మన 'సైరా' ఎంత వరకు రానిస్తాడో లేదో తెలియాలి అంటే ఇంకో వారం రోజులు ఆగాల్సిందే!