ప్రభాస్ హీరోగా `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ రాబోతున్న పీరియాడిక్ క్రేజీ ఎంటర్టైనర్ 'జాన్'. కాగా తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సాహో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమా బాగా సీరియస్ గా సాగడమే అని.. అందుకే జాన్ లో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. అందుకోసం కామెడీ బాగా రాస్తాడు అని పేరు ఉన్న గోపిమోహన్ ఈ సినిమా కోసం పని చేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ లుక్, పాత్ర తీరు వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా 1960 నాటి వస్త్ర ధారణలో రెబల్ స్టార్ సరికొత్తగా కనిపిస్తారని.. దీనికోసం ఇప్పటికే ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్స్ పనిచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ స్టోరీ బేస్డ్ చిత్రం కావడంతో రొమాంటిక్ ఎపిసోడ్స్, ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఉంటాయట.
మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇక అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్ సాధించి.. ప్రభాస్ స్టార్ డమ్ ఏంటో చూపించింది.