'యువరాజ్ సింగ్'.. భవిష్యత్తు తరాల్లో పుట్టుకొచ్చే క్రికెట్ ప్రేమికులు కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు ఇది. ఇండియా 2007లో T20 వరల్డ్ కప్ గెలిచినా.. అలాగే 2011లో వరల్డ్ కప్ గెలిచినా.. అది యువి వల్లే. అవును యువరాజ్ సింగే గెలిపించాడు. మరి అలాంటి యువరాజ్ సింగ్ చివరికి జట్టులో చోటు లేక రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా యువీ రిటైర్మెంట్ ఇలా జరగడం బాధ కలిగించే అంశమే. భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన ఓ గొప్ప క్రికెటర్ ఇలా టీంలో స్థానం కోల్పోయి.. కెరీర్ ను ముగించడం క్రికెట్ అభిమానులకు ఏ మాత్రం రుచించ లేడు. అయితే యువీ కెరీర్ లో ఎన్నో నాటకీయ కోణాలు చోటు చేసుకున్నాయి.
మరి అందరూ బయోపిక్ లు వస్తున్నాయి గాని యువి బయోపిక్ మాత్రం ఎవ్వరూ ఎందుకు ఆలోచించట్లేదో..? తిరుగులేని క్రికెటర్ గా కొనసాగుతున్న సమయంలోనే క్యాన్సర్ వ్యాధి భారిన పడటం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారత అభిమానుల కలలు కన్న ప్రపంచ కప్ ను సాధించ పెట్టడం, తన సహచర ఆటగాడైన దోనీ తనను జట్టులో నుండి తొలిగించి అవమానించడం.. వంటి ఎత్తుపల్లాలను చూశాడు యువీ.
బహుశా ఇంత డ్రామా ఏ క్రికెటర్ లైఫ్ లో జరిగి ఉండకపోవచ్చు. ఒక సినిమాకి కావాల్సినంత డ్రామా ఉన్న 'యువీ' లైఫ్ ఆధారంగా బయోపిక్ వస్తే.. అభిమానులతో పాటు భవిష్యత్తు క్రికెటర్ లకు కూడా ఆ చిత్రం ప్రేరణగా నిలుస్తోంది. మరి త్వరలోనే యువీ బయోపిక్ రావాలని కోరుకుందాం.