'జాన్' కథ ఇదే...రెండు లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్ ?

మరిన్ని వార్తలు

'సాహో' బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ 'జాన్' పై ప్రత్యేక దృష్టి పెట్టాడట. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట. ప్రభాస్ అత్యంత ధనికుడిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని.. అలాగే ప్రభాస్ ఒక పేదింటి అమ్మాయి ప్రేమలో పడతాడని.. ఆమె ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె ముందే తిరుగుతాడట.

 

ఈ ప్రేమ కథలో ప్రభాస్ ది ఆ రోజుల్లోని ఓల్డ్ గెటప్.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో కూడా ప్రభాస్ కనిపిస్తాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ చిత్రం అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుందట, మొత్తానికి ప్రభాస్ హీరోగా ఫుల్ ఎంటర్టైనర్ గా జాన్ ను తెర పై ఆవిష్కరిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS