యాక్షన్ హీరో గోపీచంద్ లో సడెన్ గా మార్పు వచ్చింది అట. మార్పు అంటే గెటప్ లో కాదు, మైండ్ సెట్ లో. యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదు అని బలంగా నమ్మే గోపీచంద్ లో ఇప్పుడు యాక్షన్ అంటేనే ఓవర్ గా వద్దు అంటున్నాడట. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా చేస్తోంది.
కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ సినిమాలో కొన్ని చోట్ల ఓవర్ గా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయట. ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే సినిమాలో పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేయమని.. అలాగే బడ్జెట్ ను తగ్గిస్తే మంచిదని గోపీచంద్ సంపంత్ కి చెబుతున్నాడట. చాణక్య రిజల్ట్ చూశాక.. సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి అది రాబట్టలేక చివరికి ప్లాప్ అనిపించుకోవడం గోపీచంద్ ఇష్టపడట్లేదని.. అందుకే ముందుగానే సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించమని గోపీచంద్ చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే సంపత్ నంది బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారట.. అలాగే కామెడీ కోసం గోపీచంద్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని... సినిమా మొత్తం మీద గోపిచంద్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట.
ఆ పాత్రలోని వేరియేషన్స్ కారణంగానే సినిమాలో కామెడీ బాగా వస్తోందని తెలుస్తోంది. అయితే గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (ప్రొడక్షన్ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.