బుక్ మై షో లో కల్కి రికార్డ్

మరిన్ని వార్తలు

నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, దీపికా లాంటి స్టార్లు నటించిన  కల్కి సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. 1000 కోట్ల మార్కుని దాటేసి, రికార్డ్స్ తిరగరాసింది. కల్కి  ఇంతటి ఘనవిజయాన్ని సాధించడంతో ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. కల్కి సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఏరియాలలో సరికొత్త రికార్డులు సృష్టించింది. వ్యక్తిగతంగా ప్రభాస్ కూడా పలు రికార్డులు సృష్టించాడు. వీటికి తోడు ఇప్పుడు మరొక రికార్డ్ కల్కి వశమైంది.  


బుక్ మై షోలో కల్కి అడ్వాన్స్  బుకింగ్ నుంచి  నిన్నటి వరకు బుక్ అయిన టికెట్స్ డీటెయిల్స్ అనౌన్స్ చేసింది. కల్కి రిలీజ్ అయ్యి  మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎక్కువ మొత్తంలో  టికెట్స్ సేల్ అవుతున్నాయని తెలిపింది బుక్ మై షో. ఇప్పటివరకు ఏ సినిమాకి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజయిన మూడు వారాల తరువాత కూడా ఈ రేంజ్ లో టికెట్లు సేల్ అవలేదని పేర్కొంది. అడ్వాన్స్ బుకింగ్ నుంచి, నిన్నటివరకు బుక్ మై షో లో కల్కి టికెట్ బుకింగ్స్ చూస్తే జూన్ 23న అడ్వాన్స్ బుకింగ్ లో  3 లక్షల 28 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. మూవీ రిలీజ్ రోజు 11 లక్షల 20 వేల టికెట్స్, రిలీజ్ తర్వాత రోజు 11 లక్షల 72 వేల టికెట్స్  కేవలం ఆన్లైన్ లో బుక్ మై షో లో సేల్ అయ్యాయి. 


కల్కి సినిమా రిలీజయి మూడు వారాల అవుతున్నా జూలై 17న కూడా 1 లక్ష 28వేల టికెట్స్ సేల్ అవటం గమనార్హం. దేశవ్యాప్తంగా కేవలం బుక్ మై షో ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఇప్పటి వరకు ఒక కోటి 21 లక్షల 50 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. ఇప్పటివరకు ఒక సినిమాకు అత్యధికంగా బుక్ మై షోలో ఇన్ని టికెట్స్ సేల్ అవ్వడం ఇదే మొదటిసారి అని మూవీ యూనిట్ పేర్కొంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS