షారుఖ్ తో సామ్ రొమాన్స్

మరిన్ని వార్తలు

మాయాసైటీస్ కారణంగా  యేడాదిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమంత ఎప్పుడెప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సామ్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థ స్థాపించింది. ఈ సంస్థ నుంచి ఒక మూవీ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ తన ప్రాజెక్ట్స్ గూర్చి అఫీషియల్ గా ఏ విషయం తెలియలేదు.  నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్స్ కూడా వరస పానిండియా సినిమాలు చేస్తూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. ఇలాంటి టైం లో సామ్ వెనకపడిపోతోంది. ఇంకా లేట్ చేస్తే ఛాన్స్ లు తగ్గిపోతాయని ఆమె ఫాన్స్, సన్నిహితులు వాపోతున్నారు. 


ఇలాంటి టైంలో సామ్ ఫాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్తోంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో నార్త్ లో కూడా ఫాన్స్ ని, ఫాలోవర్స్ ని పెంచుకున్న సామ్ నెక్స్ట్ సీటాడెల్ వెబ్ సిరీస్ తో అలరించనుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. సల్మాన్ సికిందర్ లో సామ్ నటిస్తుంది అన్న ప్రచారం జరిగినా ఆ ఛాన్స్ రష్మిక కొట్టేసింది. ఇప్పుడు మాత్రం ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అదీ కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరక్షన్ లో నటించే గొప్ప అవకాశం సామ్ కి లభించింది. 


షారుఖ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది జవాన్, ఢంఖీ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. హ్యాట్రిక్ కొట్టాలని ఈ సారి రాజ్ కుమార్ హిరాణీకి పచ్చజెండా ఊపాడు షారుఖ్. ఢంఖీ నిర్మాతలే ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కే యాక్షన్ అడ్వంచర్ అని తెలుస్తోంది. ఇంతకముందు షారుఖ్ తో నటించిన అనుష్క శర్మ, దీపికా పదుకొనే లాంటి వారు బాలీవుడ్ లో నంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు. జవాన్ తో నయనతార కూడా భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడిక సామ్ వంతు. సామ్ కూడా ఈ మూవీతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోవటం ఖాయమని ఆమె ఫాన్స్ అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS