కల్కి ఇన్ని పార్టులా?

మరిన్ని వార్తలు

ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. సలార్ హిట్ తరవాత డార్లింగ్ ఫాన్స్ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' మూవీ కోసం వరల్డ్ వైడ్ గా వెయిట్ చేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ని మహా నటి ఫేమ్  నాగ్ అశ్విన్  తెరకెక్కిస్తున్నారు. కల్కి మూవీ గూర్చి రోజు కొక న్యూస్ బయటికి వస్తోంది. ఈ మూవీలో క్రేజీ  కాస్టింగ్ ఉండటం,  భారీ బడ్జెట్ తో తెరకెక్కతుండటం, మొత్తం 24 భాషల్లో రిలీజ్ కానుంది అన్న టాక్ తో అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇప్పుడు కూడా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా మొత్తం 9 భాగాలుగా రానున్నట్లు ఫిలిం వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది.


ఈ విషయాన్ని అభినవ్ గోమఠం ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. “నేను కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను. ఇక ఇటీవల ఈ మూవీ 9 పార్టులుగా రాబోతుంది అంటూ నేను విన్నాను. అది విన్న దగ్గర నుంచి సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది” అని చెప్పటంతో ఈ న్యూస్ ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శివరాత్రి రోజున టీజర్ ని రిలీజ్ చేసి, ప్రమోషన్స్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రజంట్ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మే 9న వరల్డ్ వైడ్ గా  ఈ మూవీ రిలీజ్ కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS