2023 ప్రభాస్ కి ఒక పరాజయం, ఒక విజయంతో ముగిసింది. సలార్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకుని వరల్డ్ వైడ్ క్రేజ్ ని మరోసారి సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా 'కల్కి' తో రానున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీటీమ్ కూడా రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్పెంచుతోంది. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని కూడా చెప్తోంది మూవీ టీమ్. ఇప్పుడు కూడా మరొక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ చిత్రాన్ని దాదాపు 25కు పైగా భాషల్లో రిలీజ్ చేస్తున్నారట. ఆసియాలోనే ఇన్ని భాషల్లో రిలీజైన తొలి చిత్రంగా కల్కి నిలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో రోపొందుతోంది. ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ ఇది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పురాణాలను టచ్ చేస్తూ సాగే ఈ కథలో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నారని, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పాత్రని అశ్వథ్థామ రిప్రెజెంటేషన్ గా డిజైన్ చేసినట్లు టాక్. కమల్‌హాసన్ విలన్‌గా, దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
'కల్కి 2898 AD' 2024 మే 9న గ్రాండ్‌గా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ దాదాపు 500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ప్రభాస్ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. పైగా 25 భాషల్లో రిలీజ్ అంటున్నారు కాబట్టి కనీసం తొలి రోజే ఓపెనింగ్స్ 500కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.