'బాహుబలి' కోసం ప్రబాస్ చాలా కష్టపడ్డాడు. అమ్మాయిలకు డార్లింగ్‌గా అలరించే ప్రబాస్, బాహుబలి గెటప్‌లో దాదాపు ఐదేళ్లు ఉండిపోవాల్సి వచ్చింది. అయితే పడిన కష్టం వృధా పోలేదు. యూనివర్సల్ హీరో అయిపోయాడు ప్రబాస్ ఆ సినిమాతో. అది వేరే సంగతి. ప్రస్తుతం ప్రబాస్ దృష్టి అంతా తన 'సాహో' చిత్రం పైనే పెట్టాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అందుకోసం తన గెటప్‌ని పూర్తిగా మార్చేస్తున్నాడట ప్రబాస్. అమ్మాయిలకు ప్రబాస్ అంటే పిచ్చి. అందుకు కారణం తన కటౌటే. కటౌట్‌కి తగ్గట్లుగా తన గెటప్‌ని స్టైలిష్‌గా మార్చేస్తున్నాడట ప్రబాస్. అందుకోసం ప్రత్యేకించి, మేకప్ అసిస్టెంట్‌తో ప్రబాస్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తున్నాడట. 'సాహో'లో ఖచ్చితంగా అందరూ మెచ్చే, డిఫరెంట్ అండ్ స్టైలిష్ లుక్‌లో ప్రబాస్ కనిపించనున్నాడు. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాహుబలితో ప్రబాస్‌కి వచ్చిన స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రబాస్ న్యూ లుక్ ఒకటి సందడి చేస్తోంది. ఇదే 'సాహో'లో ప్రబాస్ లుక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఉంగరాల జుట్టుతో స్వీట్ స్మైల్‌తో ఉన్నాడు ఈ పిక్‌లో ప్రబాస్. ఇవే కాదు, చాలా స్టిల్స్ ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే 'సాహో' అసలు స్టిల్ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ స్టిల్ అయితే ఓ మ్యాగజైన్ కోసం ప్రబాస్ దిగిన ఫోటో షూట్‌కి సంబంధించినది అంటున్నారు ఇంకోపక్క. ఏది ఏమైనా ఆరడుగుల అందగాడు ప్రబాస్ ఏ లుక్‌లో ఉంటే ఏంటి, అమ్మాయిలు అమాంతం పడిపోవడానికి.