నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మలు తెలుగు భాషపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో నటించడమే కాదు, తెలుగు భాషని నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగులో తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకోవాలని ఉత్సాహపడుతున్నారు. ఈ కోవలో ఇప్పటికే ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంట్రెస్ట్‌ని బయటపెట్టడమే కాకుండా, పర్ఫామ్ కూడా చేసేసింది. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తొలిసారిగా డబ్బింగ్ చెప్పి, వావ్ అనిపించింది. ఇప్పుడు అదే బాటలో మరో ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. ఆమె ఎవరో కాదు క్యూటీ బేబీ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ప్రస్తుతం 'రాజుగారి గది - 2'లో నటిస్తోంది. ఈ సినిమాలో నటించడమే కాదు, ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ కూడా చెప్పేసుకుందట. ముద్దు ముద్దుగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాట్లాడుతుంటే, హీరో నాగార్జున కూడా పొగిడేశారట. ఇకపై తెలుగు ఇంకా బాగా నేర్చుకుంటాననీ చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్ హాట్ ఫోటోలతో కేక పుట్టిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటోంది సీరత్ కపూర్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.