Prabhas: తాతా మ‌న‌వ‌డు... ప్ర‌భాస్‌

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ వారంలోనే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించే అవ‌కాశాలు ఉన్నాయి. ముందుగా ప్ర‌భాస్ లేని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆ త‌ర‌వాత ప్ర‌భాస్ వ‌చ్చి ఈ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇదో హార‌ర్ కామెడీ అని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు మ‌రో కీల‌క‌మైన స‌మాచారం లీక్ అయ్యింది. అదేంటంటే.. ఇందులో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ చేయ‌బోతున్నాడ‌ట‌. తాత‌. మ‌న‌వ‌డిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. అదే నిజ‌మైతే ఇది షాకింగ్ స‌ర్‌ప్రైజ్ అవ్వ‌బోతోంది.

 

తాత ఆస్తి కోసం మ‌న‌వ‌డు చేసే ప్ర‌య‌త్నం ఈ క‌థ‌. తాత పాత్ర‌లో ఓ బాలీవుడ్ న‌టుడు క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. బొమ‌న్ ఇరానీ లాంటి వాళ్ల‌ని ఈ పాత్ర కోసం సంప్ర‌దించారు. ఇంత‌లో ఏమైందో ఏమిటో, ఈ పాత్ర కూడా ప్ర‌భాస్ తో చేయిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. తాత పాత్ర అంటే ఓల్డ్ గెట‌ప్ ఏమీ ఉండ‌దు. క‌థ‌ని ఫ్లాష్ బ్యాక్‌లో చెబుతున్నప్పుడు ప్ర‌భాస్ తాత పాత్ర‌ని.. యంగ్ లుక్ లోనే చూపిస్తారు.కాబ‌ట్టి.. గెట‌ప్ లో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. అందుకే తాత పాత్ర కూడా ప్ర‌భాస్ తోనే చేయించాల‌ని భావిస్తున్నారు. ఈ చిత్రంలో న‌లుగురు హీరోయిన్లు ఉంటార‌ని టాక్‌. ఓ కీల‌క‌మైన పాత్ర కోసం సంజ‌య్ ద‌త్ పేరు ప‌రిశీలిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS