ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ అశ్విన్. మూడో సినిమాకే ప్రభాస్ తో పని చేసే అవకాశాన్ని అందుకున్నాడు. అది కూడా.. ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్లు ఈ సినిమాలో చేరడంతో... మరింత ఆకర్షణ పెరిగింది. దురదృష్టం ఏమిటంటే.. ఈ సినిమా రోజు రోజుకీ వెనక్కి వెళ్తోంది.
నిజానికి.. `రాధే శ్యామ్` అయిన వెంటనే ఈ చిత్రాన్న ఏ ప్రారంభించాలి. కానీ.. `ఆదిపురుష్`కి ఓకే చెప్పాడు ప్రభాస్. `ఆదిపురుష్` చేస్తూనే.. నాగ అశ్విన్ సినిమా మొదలెట్టాలన్నది ప్లాన్. కానీ ఇప్పుడు ఆ ప్లానింగ్ మారింది. `ఆదిపురుష్` అవ్వగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాని మొదలెట్టాలని భావిస్తున్నాడట. దాంతో.. నాగ అశ్విన్ సినిమా మరింత వెనక్కి వెళ్లనుంది. దీంతో అసలు ఆ సినిమా ఉంటుందా..? లేదా? అనే అనుమానాలు నెలకన్నాయి. నాగ అశ్విన్ సినిమాకి ఏకంగా రెండున్నరేళ్ల కాల్షీట్లు కావల్సివస్తోందని, అందుకే ఈ సినిమాని ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తయ్యేంత వరకూ నాగ అశ్విన్ ఖాళీగా ఉంటాడా? అసలు రెండేళ్ల తరవాత ఈ సినిమాని పట్టించుకుంటాడా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయిప్పుడు.