కేజీఎఫ్ తరవాత... తెలుగు హీరోలంతా ప్రశాంత్ నీల్ పై ఫోకస్ చేశారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్.. వీళ్లందరి నుంచీ ప్రశాంత్ కి పిలుపొచ్చింది. ఈ ముగ్గురికీ కథలు చెప్పేశాడు ప్రశాంత్. కాస్త ముందూ వెనుక అంతే. ఈ ముగ్గురితో.. ప్రశాంత్ నీల్ చెరో సినిమా చేయడం ఖాయం. అయితే ప్రభాస్ తో ఓ రీమేక్ చేయాలనుకుంటున్నాడట ప్రశాంత్.
ఉగ్రమ్ అనే కన్నడ సినిమాని ప్రభాస్ తో తీయాలన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన. ఉగ్రమ్ కి దర్శకుడు ప్రశాంత్ నే. 4 కోట్లతో తెరకెక్కిన ఈ కన్నడ సినిమా దాదాపు 35 కోట్లు సాధించి సంచలనం సృస్టించింది. నిజానికి ఈ సినిమాని అప్పట్లో తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఈసినిమాని ఇప్పుడు ప్రభాస్ తో ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ బాబుకీ ప్రశాంత్ నీల్ ఇదే ఐడియా చెప్పాడని, కానీ... రీమేక్ చేయడానికి మహేష్ అంతగా ఇష్టపడలేదని, చివరికి ప్రభాస్ తో ఈ ప్రాజెక్టు ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.