'బాహుబలి' డార్లింగ్‌ అయ్యేదెప్పుడు.?

By iQlikMovies - July 18, 2018 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

'డార్లింగ్‌' సినిమాతో డార్లింగ్‌ అంటూ అంతా ముద్దుగా పిలుచుకుంటున్నారు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రబాస్‌ని. అయితే 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌ ఇమేజే మారిపోయింది. ఏకంగా యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడు ప్రబాస్‌. ఎన్నాళ్లైనా 'బాహుబలి' ప్రభావం మాత్రం పోవడం లేదు ప్రబాస్‌కి. అంతటి గొప్ప స్టాంప్‌ వేసింది ఆ పాత్ర, ఆ సినిమా ప్రబాస్‌ కెరీర్‌పైన. 

ఆ ఇంప్రెషన్‌ నుండి అభిమానులు తేరుకోవాలంటే, ప్రబాస్‌ నుండి మరో సినిమా రావాలి. అది 'డార్లింగ్‌' ఇమేజ్‌ తిరిగొచ్చేలా ఉండాలి. అంటే ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీ అయ్యుండాలన్న మాట. 'బాహుబలి' తర్వాత ప్రబాస్‌ 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, ప్రబాస్‌ 'జిల్‌' ఫేం రాధాక్రిష్ణతో సినిమాకి కమిట్‌ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేది లేదు అని ప్రబాస్‌ ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. అందుకే ఫ్యాన్స్‌కి ఓ గుడ్‌ న్యూస్‌. '

సాహో' సినిమా సెట్స్‌పై ఉండగానే ప్రబాస్‌ రాధాక్రిష్ణ సినిమాని కూడా పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడట. వీలైతే 'సాహో' కన్నా ముందే ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట ప్రబాస్‌. ఎలాగూ 'సాహో' యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ. అంతకు మించి భారీ బడ్జెట్‌ అండ్‌ హెవీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో కూడుకున్న చిత్రం. సో ఆ యాంగిల్‌లో ఎంతనుకున్నా 'సాహో' సినిమా రావడానికి చాలా ఎక్కువ టైమే పట్టేలా ఉంది. అందుకే ప్రబాస్‌ తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

చూడాలి మరి, ప్రబాస్‌ 'సాహో' కన్నా ముందే రొమాంటిక్‌ మూవీతో వస్తాడేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS