తీపి కబురు చెప్పిన 'డార్లింగ్‌'.!

By iQlikMovies - September 06, 2018 - 12:14 PM IST

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయిన ప్రబాస్‌ నుండి ఆ తర్వాత మరో సినిమా రాలేదు. ప్రస్తుతం అదే రేంజ్‌లో యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ 'సాహో' తెరకెక్కుతోంది. దాంతో పాటు లేటెస్టుగా ప్రబాస్‌ మరో స్వీట్‌ న్యూస్‌ చెప్పాడు. ప్రబాస్‌ - రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 'జిల్‌' సినిమాతో హిట్‌ కొట్టిన రాధాకృష్ణతో ప్రబాస్‌ సినిమా చేసేందుకు ఎప్పుడో కమిట్‌ అయ్యాడు. ఈ సినిమాలో ప్రబాస్‌కి జోడీగా పూజా హెగ్దే నటిస్తోంది. 

కాగా ఈ సినిమాకి సంబంధించి లేటెస్టుగా ట్విట్టర్‌లో స్పందించాడు ప్రబాస్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందట. ఇదో క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ. 'డార్లింగ్‌' సినిమాతో రొమాంటిక్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రబాస్‌ ఆ తర్వాత నటిస్తున్న ఆ స్థాయి రొమాంటిక్‌ స్టోరీ ఇదే అవుతుందట. గోపీకృష్ణ మూవీస్‌తో కలిసి యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాని రూపొందిస్తోంది. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సమర్పకుడు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని ప్రబాస్‌ ప్రకటించాడు. 

మరోవైపు ప్రబాస్‌ నటిస్తున్న 'సాహో' శరవేగంగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంటోంది. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా బాలీవుడ్‌ ప్రముఖ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS