ప్రభాస్ కథానాయకుడిగా `ఆది పురుష్` అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ టైటిల్ బయటకు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. ఈలోగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది రామాయాణ ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతున్న కథ అని చిత్రబృందం హింట్ ఇచ్చింది. అలాగని... మొత్తం రామాయణమే ఉండదు. కొంత సోషియో ఫాంటసీ సినిమాలా సాగుతుందట. ప్రస్తుతం - పూర్వం.. అంటూ రెండు రకాలుగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
అలానే ప్రభాస్ పాత్రలో చాలా కోణాలుంటాయని తెలుస్తోంది. ప్రభాస్ రాముడిగా కనిపించినా అది కొద్దిసేపే అని సమాచారం అందుతోంది. రాముడిగా ప్రభాస్ నాలుగైదు సన్నివేశాల్లోనే కనిపిస్తాడట. మహాభారతంలోని ఘట్టాల్ని కూడా తెలివిగా ఈ కథలో ఇరికించారని సమాచారం. రామాయణంలో చాలా పాత్రలుంటాయి. కాకపోతే.. ఈ సినిమాలో హనుమంతుడు, రావణాసురుడు పాత్రల్ని ఎక్కువగా హైలెట్ చేయబోతున్నారని సమాచారం. ఆ రెండు పాత్రల కోసం ఇద్దరు బాలీవుడ్ హీరోల పేర్లు పరిశీలిస్తున్నారు. నిజానికి హనుమంతుడిగానూ ప్రభాసే కనిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కానీ.. చిత్రబృందం ఈ విషయంలో ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని టాక్.