బాలకృష్ణ - బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. సింహా, లెజెండ్.. ఒకదాన్ని మించి మరోటి హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. ఇది వరకు `మోనార్క్` అనుకన్నారు. కానీ అది కాదని తేలిపోయింది.
ఆ తరవాత `మొనగాడు` అనే మరో టైటిల్ వినిపించింది. దానిపైనా క్లారిటీ లేదు. ఇప్పుడు మరో టైటిల్ బయటకు వచ్చింది. అదే `బొనాంజా`. ఈ సినిమా అభిమానులకు బంపర్ బొనాంజాలా ఉంటుందని, అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలొస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ లో ఇప్పటికే ఈ టైటిల్ ని రిజిస్టర్ కూడా చేసేశారు. బాలయ్య.. బోయపాటి.. బొనాంజా. మూడూ `బి` అక్షరాలతో ముడిపడి ఉన్నవే. అందుకే.. ఈ టైటిల్ దాదాపు ఫిక్సయిపోయినట్టు టాక్.