చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రస్తుతానికైతే.. తనంత బిజీయెస్ట్ స్టార్ ఈ దేశంలోనే లేడని చెప్పాలి. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే, పెద్ద సినిమాలే. అయితే.. అక్కడే ఓ చిక్కు వచ్చి పడుతోంది. అన్ని సినిమాలకూ కావల్సిన సంఖ్యలో డేట్లు ఇవ్వలేకపోతున్నాడు. ఓ సినిమాకి డేట్లు ఇచ్చాడంటే.. మిగిలిన సినిమాలన్నీ ఆగిపోతున్నాయి. కాల్షీట్ల సమస్య, ఇతరత్రా కారణాలతో.. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు స్లో ఫేజ్ లో నడుస్తున్నాడు.
రాధే శ్యామ్ జనవరి 14న విడుదల అవుతోంది. 2022 వేసవిలో.. ప్రభాస్ `సలార్` రాబోతోంది. రెండు మూడు నెలల వ్యవధిలో ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రావడం ఊహించని విషయమే. అయితే.. ఇప్పుడ ప్రభాస్ ప్లానింగ్ మారిపోయింది. సలార్ ని కొంత కాలం పక్కన పెట్టి, ప్రాజెక్టు కెని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే... ప్రాజెక్ట్ కె రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందట. తొలి షెడ్యూల్ 40 రోజుల పాటు సాగుతుందట. ఈ 40 రోజులూ.. సలార్ ఆగిపోయినట్టే. దాంతో సలార్ రిలీజ్ డేట్ లో కూడా మార్పులు రాబోతున్నాడు. 2022 చివర్లోనే ఈ సినిమా విడుదలకు సాధ్యం అవుతుందని టాక్. అంటే.. వేసవిలో రావాల్సిన సలార్... మరో ఆరు నెలలు ఆసల్యంగా విడుదల అవుతుందన్న మాట.