బాహుబలి తో బౌండరీలు దాటిన ప్రభాస్ క్రేజ్ కి.. బ్లాక్ బాస్టర్ సక్సెస్ తో కన్నడ సినిమా రేంజ్ పెంచేసిన ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు తోడైతే.. ఆ కాంబినేషన్ పై అంచనాలు ఎలా వుంటాయో ఊహించగలమా? అలాంటి ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉండాలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'కెజిఎఫ్ 2' తరువాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న భారీ ఫ్యాన్ ఇండియా చిత్రం 'సలార్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఫ్యాన్ ఇండియా చిత్రంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రధమంగా ఏ భాషలో తెరకెక్కిస్తున్నారనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తింది.
తాజా సమాచారం ప్రకారం షూటింగ్ సింహ భాగం కన్నడ లో జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఎంత ఫ్యాన్ ఇండియా చిత్రమైనా ప్రభాస్ అభిమానులు తెలుగులోనే ఎక్కువ కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ప్యారెలెల్ గా చిత్రీకరిస్తే మంచిదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. లేదా ఎలాగు ప్రశాంత్ నీల్ కు తెలుగు కూడా స్పష్టంగా తెలుసు కాబట్టి 'సలార్' ను తెలుగులోనే తెరకెక్కించడం బెటర్ అని భావిస్తున్నారు. మరి ఈ వార్త పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.