పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రజంట్ ఒకేసారి రెండు సినిమాలకి వర్క్ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' హను రాఘవపూడి డైరక్షన్ లో ఫౌజీ చేస్తున్నాడు. మార్చ్ లో రాజా సాబ్ విడుదల ఉంది. నెక్స్ట్ 'స్పిరిట్' కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రభాస్ రీసెంట్ మూవీ కల్కి జపాన్ లో జనవరి 3న రిలీజ్ కానుంది. జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే కల్కి రిలీజ్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ ప్రమోషన్స్ కోసం వెళ్లాల్సి ఉండగా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది. కారణం ప్రభాస్ గాయపడటమే.
అవును కల్కి రిలీజ్ లో భాగంగా జపాన్ వెళ్లాల్సి ఉండగా క్యాన్సిల్ అయినట్లు ప్రభాస్ తెలిపారు. కారణం 'ఫౌజీ' మూవీ షూటింగ్ లో గాయపడినట్టు తెలిపారు. యాక్షన్ సీక్వెన్స్ లో కాలికి, చేతి చీలమండకి గాయం అయినట్టు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో జపాన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పోస్ట్ చేసిన తరవాత ఇదే విషయాన్ని జపాన్ కల్కి సినిమా డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ ట్విన్ కూడా సోషల్ మీడియాలో అఫీషియల్ గా పోస్ట్ చేసింది.
ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ జపాన్ ఫాన్స్ కోసం కల్కి ప్రమోషన్స్ నిమిత్తం డిసెంబర్ 18న జపాన్ కి వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో మిగతా కల్కి టీమ్ జపాన్ వెళ్లనుంది. డిసెంబర్ 18న కల్కి ప్రీమియర్స్ లో నాగ్ అశ్విన్ పాటిసిపేట్ చేస్తున్నారని ట్విన్ సంస్థ పేర్కొంది. ప్రభాస్ కి గాయం అయిన సంగతి తెలియగానే ఫాన్స్ ఆందోళన పడుతున్నారు. డార్లింగ్ కి ఏమయ్యింది తొందరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. జపాన్ వాసులు కూడా ప్రభాస్ గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ పెడుతున్నారు.