ప్రబాస్ 'బాహుబలి' సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడో ఓకే అయ్యింది. అయితే ప్రబాస్‌కి 'బాహుబలి' సినిమాతో వచ్చిన స్టార్‌డమ్‌తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ప్రబాస్ మళ్లీ 'బాహుబలి'లాంటి సినిమా చేస్తాడో లేదో తెలీదు. చేసేందుకు అవకాశం కూడా లేదు. ఇలాంటి అరుదైన అవకాశాలు లైఫ్‌లో ఒక్కసారే వస్తాయి. 'బాహుబలి' సినిమాతో అలాంటి ఛాన్స్ వచ్చింది ప్రబాస్‌కి. అయితే ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఈ సినిమాతో వచ్చిన స్టార్‌డమ్ ఎఫెక్ట్‌తో, ప్రబాస్ తర్వాత చేయబోయే సినిమాలపై ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. ప్రతీదీ ఆ సినిమాతో పోల్చి చూస్తారు. ఎంత కమర్షియల్ సినిమా అయినా బాహుబలితో పోల్చడం వల్ల కాదు. 'బాహుబలి' సినిమా రాజమౌళి బ్రాండ్. ఆ సినిమా మార్కెట్ అలాంటిది. అందుకే ఇదంతా చూసి ప్రబాస్ కొత్త సినిమా విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఏదో చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కనుందట. అసలు ఫస్ట్ సుజిత్, ప్రబాస్‌కి చెప్పిన కథనే ఇప్పుడు తెరకెక్కిస్తున్నాడా? లేక కథలో కూడా మార్పులు జరిగాయా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. చిన్న ప్రాజెక్టు అనుకున్న ఈ సినిమా ఇప్పుడు పెద్ద ప్రాజెక్టుగా రూపాంతరం చెంది సుజిత్ చేతిలో పడింది. ఈ గొప్ప అవకాశాన్ని సుజిత్ ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి మరి.