టాలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రగడ సృష్టించిన నటి శ్రీరెడ్డి ఉదంతం అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు ఆమె రచ్చ ముగిసింది అనుకుంటే, తాజాగా మరో నటి టాలీవుడ్‌లోని ఓ దర్శకునిపై ఆరోపణలు చేయడం మొదలెట్టింది.
ఆమె ఎవరో కాదు, 'ఒక విచిత్రం', 'మాయాజాలం', 'బ్రహ్మిగాడి కథ' తదితర చిన్న సినిమాల ద్వారా హీరోయిన్‌గా సుపరిచితురాలైన పూనమ్ కౌర్. అచ్చమైన హైద్రాబాదీ అమ్మాయి. అయితే ఆశించినంతగా అవకాశాల్లేవు. ఈ బ్యూటీ సడెన్‌గా ఇప్పుడు ఓ దర్శకుడ్ని పట్టుకుని 'నమ్మక ద్రోహి' అంటూ ఆరోపణలు చేస్తోంది. ఆ దర్శకుడు పేరు చెప్పలేదు కానీ, కొన్ని హింట్స్ ఇచ్చింది. 'జల్సాలు చూపిస్తూ, అజ్ఞాతవాసంలో పడేస్తాడు జాగ్రత్త..' అంటూ ఆ దర్శకుడిపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. దాంతో ఆ దర్శకుడు ఎవరంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'అవకాశాల్లేవని కుంగుబాటులో ఉన్నావు. అందుకే ఇలా మాట్లాడుతున్నావ్..' అని ఓ నెటిజన్ పూనమ్‌ని కామెంట్ చేశాడు. అందుకామె, అవును నేను కుంగుబాటులోనే ఉన్నాను అయినా కానీ నిజం మాట్లాడుతున్నాను. మీ గురువులు ఆశలు చూపి జీవితాల్ని నాశనం చేయడంలో గొప్పవారు..నన్ను ఫాలో చేయడం ఆపి ఆయన్ని ఫాలో చేయ్ నీకే తెలుస్తుంది..' అని ఆ నెటిజన్‌కి సవాల్ విసిరింది.
అవును నిజమే ప్రస్తుతం పూనమ్‌కి అవకాశాల్లేవు. అయితే మాత్రం దర్శకున్ని ఇలా విమర్శించడం సబబు కాదు కదా. అనవసర ఆరోపణలు చేసి, ఇండస్ట్రీ పరువు రచ్చకీడ్చిన శ్రీరెడ్డి పరిస్థితి ఏమైంది? చివరికి ఏం సాధించింది? ఇవన్నీ తెలిసి కూడా పూనమ్ ఎందుకిలా చేస్తోందో ఆమెకే తెలియాలి మరి.