ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్, మారుతి సినిమా... ఇలా లైనప్ బలంగా ఉంది. అయితే ఒక్కటే చిక్కు. వీటన్నింటికీ కాల్షీట్లు కేటాయించడం. ఒక్కో సినిమాకీ నెలకు మూడు, నాలుగు రోజులు మాత్రమే కేటాయించగలగుతాడు. అందుకే... ఏ సినిమా పూర్తవ్వడం లేదు. ఇప్పుడు ప్రభాస్ ఆలోచన మారింది. ఒకే సినిమాని గంపగుత్తగా డేట్లు ఇచ్చేయాలని ఫిక్సయ్యాడట. ఫస్ట్ ఛాన్స్ `సలార్`కే దక్కిందని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం సలార్. కేజీఎఫ్ తరవాత ప్రశాంత్ నీల్ చేసే సినిమా ఇది. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడుతుంది. ప్రశాంత్ నీల్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. కచ్చితంగా సలార్ మినిమం గ్యారెంటీ మూవీ. అభిమానులు కూడా ప్రభాస్ నుంచి ఇలాంటి సినిమానే ఆశిస్తున్నారు. కాబట్టి.. ప్రభాస్ ఇప్పుడు సలార్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. `రాధే శ్యామ్` కొట్టిన దెబ్బ ఎలాంటిదో తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. అందుకే.. వాళ్లకు ఖుషీ చేయాలన్న ఉద్దేశంతో సలార్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, విడుదల చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. సలార్ పూర్తయ్యాకే మిగిలిన సినిమాలపై దృష్టి పెడతాడని టాక్. ఆ లెక్కన మారుతి సినిమా బాగా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.