ఆర్మాక్స్ మీడియా టాప్ వన్ లో ప్రభాస్

మరిన్ని వార్తలు

ఆర్మాక్స్ మీడియా  ప్రతి నెలలో భార‌త‌దేశంలో అత్యంత ప్ర‌జాద‌రణ పొందిన స్టార్స్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది. ఆర్మాక్స్  మీడియా చేసిన ఈ సర్వేలో ప్ర‌భాస్ దేశంలోనే నంబ‌ర్‌-1 స్టార్ గా నిలిచాడు. జూన్ నెలలో అత్యంత ప్రజాధారణ పొందిన స్టార్స్ లో ఖాన్ లని కూడా వెనక్కి నెట్టి, ప్రభాస్ టాప్ కి చేరుకున్నాడు. కల్కి మూవీ సాధించిన  విజయం వలనే  ప్రభాస్ టాప్ కి చేరుకున్నాడు. మే నెలలో అగ్రస్థానంలో ఉన్న ప్రభాస్ జూన్ లో టాప్ వన్ కి చేరటం విశేషం. షారుఖ్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. దళపతి విజయ్ మూడో ప్లేస్ లో. అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు వరుసగా నాలుగు, ఐదు, ఆరు ప్లేస్ ల్లో ఉండ‌గా, రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 


కల్కితో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి, రికార్డ్స్ క్రియేట్ చేసిన ప్రభాస్, షారుఖ్ ఖాన్ లాంటి హీరోని కూడా వెనక్కి నెట్టేశాడు. డార్లింగ్ క్రేజ్ చూసి అతని ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 బజ్ తో అల్లు అర్జున్. దేవర, వార్ , డ్రాగన్ లాంటి ప్రాజెక్ట్స్ వలన ఎన్టీఆర్, రాజమౌళి తో ప్రాజెక్ట్స్ కారణంగా మహేష్ తరవాత స్థానాల్లో నిలిచారు. ఈ సర్వేలో చెర్రీ కాస్తా వెనక పడ్డాడు. అసలు దేశ వ్యాప్తంగా టాలీవుడ్ హీరోలకి టాప్ టెన్ లో ఆదరణ దక్కటం, విశేషం.        


హీరోయిన్స్ లో ఆలియా భట్ టాప్ వన్ లో ఉండగా, సమంత, దీపికా పదుకొనే తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మయా సైటీస్ కారణంగా ఒక ఏడాదిగా సినిమాలకి దూరంగా ఉన్న సమంత కూడా ఈ సర్వేలో సెకండ్ ప్లేస్ సాధించటం గొప్ప విషయం. అంత మంది బాలీవుడ్ భామల్ని కాదని  సామ్ కి పట్టం కట్టారు. నెక్స్ట్  దీపికా కల్కి మూవీతో మరో సారి హైలెట్ అయ్యింది. ఈ క్రమంలోనే  మూడో ప్లేస్ లో నిలిచింది. కాజల్ అగర్వాల్ , కత్రినా కైఫ్ లు టాప్ 5 లో ఉన్నారు.  టాప్ 10 లో ఉన్న 6 గురు సౌత్ హీరోయిన్స్ ఉండటం విశేషం. నయనతార, రష్మిక మందన్న, కియారా అద్వానీ, కృతి సనన్, త్రిషలు టాప్ 10 లో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS