చిరుకి నో.. రవితేజ కు ఎస్..!

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రానున్న మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ బాలీవుడ్ లో అజయదేవగన్, ఇలియానా నటించిన రైడ్ కి రీమేక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోరే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య రీసెంట్ గా ఒక నెటిజన్ రీమేక్ సినిమా అని మాట్లాడగా హరీష్ ఓన్లీ లైన్ మాత్రమే తీసుకుని చాలా మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. దీనితో హరీష్ మార్క్  స్క్రీన్ ప్లే ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఆగస్టు లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. త్వరలోనే  టీజర్ రిలీజ్ చేస్తారని టాక్.


ఆగస్టు 15 న థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్ చేస్తున్నాడని   సమాచారం. సిద్దు రోల్ కి సంబంధించి షూట్ ఆల్ రెడీ కంప్లీట్ అయిపోయినట్లు   తెలుస్తోంది. DJ టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సిద్దు ఈ మూవీలో క్యామియో రోల్ చేయటంపై పలువురిలో ఆసక్తి నెలకొంది. టిల్లుకి ప్రస్తుతం ఉన్న ఇమేజ్ తో సోలో హీరో గా సినిమాలు చేస్తూనే, మరో పక్క ఇలా గెస్ట్ రోల్స్ లో కూడా నటిస్తున్నాడు. సిద్దు క్రేజ్  మిస్టర్ బచ్చన్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.  


ఆ మధ్య మెగాస్టార్ చిరు సినిమాలో గెస్ట్ రోల్ ఆఫర్ చేస్తే సిద్దు సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో సిద్దు గెస్ట్ రోల్ ఎందుకు చేస్తున్నాడని, కొందరిలో సందేహం నెలకొంది. అంటే సిద్ధుకి కచ్చితంగా పేరు తెచ్చి పెట్టే పాత్ర అయి ఉంటుందని సినీ క్రిటిక్స్ వాదన.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS