దాదాపు అగ్ర దర్శకులందరితోనూ పని చేశాడు ప్రభాస్. త్రివిక్రమ్ కూడా అంతే... అగ్ర కథానాయకులతో ఓ రౌండ్ వేసేశాడు. కానీ.. వీరిద్దరూ ఒకరితో ఒకరు పనిచేయలేదు. ప్రభాస్ - త్రివిక్రమ్ కాంబో చూడాలన్నది అభిమానుల ఆశ. చాలాసార్లు వీరి కాంబినేషన్ పట్టాలెక్కేంత వరకూ వెళ్లింది. కానీ.. చివరి క్షణాల్లో వర్కవుట్ అయ్యేది కాదు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ త్వరలోనే కార్య రూపం దాల్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
అటు ప్రభాస్‌నీ ఇటు త్రివిక్రమ్నీ కలిపే బాధ్యత ఓ ప్రముఖ నిర్మాత తీసుకున్నాడని టాక్. త్రివిక్రమ్ కూడా ప్రభాస్ తోసినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండడంతో - ఈ కాంబో ఓకే అయ్యే అవకాశాలు మరింత బలపడ్డాయి. అన్నీ కుదిరితే 2021లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ ప్రభాస్ సినిమాపై దృష్టి పెట్టే చేసే అవకాశాలున్నాయి.