ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దేశ వ్యాప్తంగా పేరున్న దర్శకులంతా.. ప్రభాస్ తో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతోంది. టాలీవుడ్ లో స్టార్ దర్శకుల్లో కొంతమంది ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లంతా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం ఎప్పుడొస్తుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ లో టాప్ 3 దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకడు. ప్రభాస్ తో త్రివిక్రమ్ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఓ దశలో త్రివిక్రమ్ సైతం ప్రభాస్ కి టచ్ లో వెళ్లాడు.కానీ.. ఇంత వరకూ ఈ కాంబో సెట్ కాలేదు. బోయపాటి శ్రీను కూడా ప్రభాస్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు,. బోయపాటి మంచి మాస్ డైరెక్టర్.
ప్రభాస్ లో ఉన్న మాస్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అందుకే ఈ కాంబోపై అంత ఇంట్రస్ట్. సుకుమార్ - ప్రభాస్ కాంబో కూడా వెయింటింగ్ లోనే ఉంది. ఇద్దరివీ భిన్నధృవాలే కావొచ్చు.కానీ.. సుకుమార్ ఇప్పుడు పూర్తిగా మాస్ బాట పట్టాడు. రంగస్థలం దానికి ఉదాహరణ. పుష్ష కూడా అలానే ఉండబోతోందట. ప్రభాస్ లాంటి హీరోని హ్యాండిల్ చేయడం సుకుమార్‌కి సులభమే. పరశురామ్ కీ కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. తనతో ఓసినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఒకవేళ సర్కారు వారి పాట హిట్ అయితే... ప్రభాస్ నుంచి ఆఫర్ ఈజీగా వస్తుంది.
కానీ.. ఈ దర్శకులంతా... ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలి. ఎందుకంటే.. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేసరికే ఈజీగా మరో మూడేళ్లు పడుతుంది. ఈలోగా రాజమౌళి, పూరి, కొరటాల శివ వీళ్లంతా లైన్ లోని రాకూడదు. వస్తే మాత్రం... ఈ వెయిటింగ్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.