ప్రభుదేవా మల్టీ ట్యాలెంటెడ్. కోరియోగ్రఫీ, నటన, దర్శకత్వం.. మూడు విభాగాల్లో హిట్టు. దర్శకత్వం వైపు వచ్చిన తర్వాత కోరియోగ్రఫీ తగ్గించేశారు. అంతేకాదు బాలీవుడ్ సినిమాల బిజీతో టాలీవుడ్ రావడమే తగ్గించేశారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ తో పాటు మరికొందరు మంచి సిగ్నేచర్ స్టెప్స్ ఇస్తున్నప్పటికీ ప్రభు మాస్టర్ డ్యాన్స్ ని టాలీవుడ్ ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఐతే ఇప్పుడా గ్యాప్ కి తెర పడింది. ప్రభుదేవా మళ్ళీ టాలీవుడ్ కి వచ్చారు. కోరియోగ్రఫీ చేయడానికి రెడీ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో ఓ సాంగ్ కి చేయబోతున్నారు ప్రభుదేవా. ఇటివలే దీనికి ప్రకటన వచ్చింది. మెగాస్టార్ తో ప్రభుదేవాకి మంచి హిట్స్ వున్నాయి. ఇప్పుడు మరొసారి ప్రభు మాస్టర్ తో మెగా స్టెప్పులు అంటే.. ఖచ్చితంగా సిగ్నేచర్ స్టెప్స్ పక్కాగా వుంటాయి. ఈ సినిమాతో పాటు మంచు విష్ణు హీరో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఓ పాట ఒప్పుకున్నారు ప్రభుదేవా. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు ప్రభు మాస్టర్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ప్రభుదేవాని దర్శకుడిగా కంటే డ్యాన్సర్ గానే ఎక్కువ అభిమానిస్తారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఇష్టానికి తగ్గట్టు మళ్ళీ కోరియోగ్రఫీతో బిజీ అవ్వడం ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూసే.