ప్ర‌భుదేవా కీల‌క నిర్ణ‌యం.. అందుకేనా ఈ తాప‌త్ర‌యం?

మరిన్ని వార్తలు

ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్ర‌భుదేవా. డాన్సుల‌కు ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచాడు. వెండి తెర‌పై డాన్సుల స్వ‌రూప‌మే మార్చేశాడు ప్ర‌భుదేవా. త‌ను డాన్స‌ర్‌గా బిజీగా ఉన్న‌ప్పుడే హీరోగా అవ‌తారం ఎత్తాడు. హీరోగా కెరీర్ డ‌ల్ అవుతుండ‌గా.. ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. బాలీవుడ్ లో ప్ర‌భుదేవా పేరిట కొన్ని సూప‌ర్ హిట్లు ఉన్నాయి. ద‌ర్శ‌కుడ‌య్యాక‌.. మ‌ళ్లీ కొరియోగ్ర‌ఫీ అంటే క‌ష్టం క‌దా. దాంతో డాన్స్ మాస్ట‌ర్ సైడ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయ‌న డాన్స్ మాస్ట‌ర్ గా మ‌ళ్లీ బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుదేవా ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్‌. మెగా ఫోన్‌ని పూర్తిగా దూరం పెట్టి, కొరియోగ్ర‌ఫీపై దృష్టి సారించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చాడ‌ట‌. ఇటీవ‌ల చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` కోసం చిరు, స‌ల్మాన్‌ల‌తో స్టెప్పులు వేయించాడు ప్ర‌భుదేవా. ఆ త‌ర‌వాత మంచు విష్ణు సినిమా కోసం ఓ పాట కంపోజ్ చేశాడు. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ ఆయా ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. `నేను డాన్స్ మాస్ట‌ర్ గా బిజీ కాబోతున్నా..` అనే స్టేట్‌మెంట్‌ని ప్ర‌భుదేవా ప‌రోక్షంగా ఇవ్వ‌గ‌లిగాడు. ఇప్పుడు డాన్స్ మాస్ట‌ర్ల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. డాన్సుల విష‌యంలో హీరోలంతా గ‌ట్టిగా దృష్టి పెట్టారు. ఒక్కో పాట‌కూ రూ.10 నుంచి 15 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తున్నారు డాన్స్ మాస్ట‌ర్లు. ఒక సినిమాలు నాలుగు పాట‌లు చేస్తే చాలు. అర‌కోటి ప‌ట్టుకెళ్లిపోవొచ్చు. అందుకే.. ప్ర‌భుదేవా కూడా ఇప్పుడు త‌న‌లోని డాన్స్ మాస్ట‌ర్‌ని బ‌య‌ట‌కు తీసుకురావాల‌నుకుంటున్నాడేమో.? ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌క‌త్వాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ని టాక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS