ట్రైలర్ రివ్యూ : ఎఫ్ 3.. మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్

మరిన్ని వార్తలు

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, ఎఫ్3 థియేట్రికల్ బయటికి వచ్చింది. 2 నిమిషాల 32 సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్... ఫన్ రైడ్ గా వుంది. ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని మొదటే చెప్పిన చిత్ర యూనిట్.... ట్రైలర్ లో కూడా ఆ ఎలిమెంట్ ని చూపించింది.

 

   

''మనీ ప్లాంట్ బిర్యానీ, మనీ ప్లాంట్ చారు , మనీ ప్లాంట్ వేపుడు .. ఏంటి ఫుడ్ కూడా మనీ ప్లాంట్ తోనేనా ? తప్పదయ్యా బాగా డబ్బులు రావాలి కదా.. '' అనే డైలాగు .. 

'మన ఆశలే మన విలువలు'' 

పాతిక లక్షలు.. తెల్లారేసరికి యాభై లక్షలైపోవాలి.. అనే డైలాగ్స్ కూడా వినోదాన్ని పంచాయి. 

 

 

''వాళ్ళది పెద్ద మాయల మరాఠి ఫ్యామిలీ'' అని రఘుబాబు అంటే 

''వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మనది దగ్గుబాటి ఫ్యామిలీ'' అని వెంకటేష్ చెప్పడం 

'వాళ్ళది పెద్ద దగా ఫ్యామిలీ'' అని వెంకటేష్ అంటే 

'వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మనది మెగా ఫ్యామిలీ'' అని వరుణ్ తేజ్ అనడం ఎఫ్ 2ని గుర్తుకు తెచ్చింది. ఎఫ్ 3 లో కొత్తగా చేసిన సునీల్ కూడా తన మార్క్ తో ఆకట్టుకున్నారు. ''ఆడోళ్ళు బంగారు చూస్తే అంతే సైకోలైపోతారు'అని సునీల్ పలికిన డైలాగ్ పేలింది. 

 

 

దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో అదరగొట్టారు.ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్3 థియేటర్లలో కి వస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS