మీరు హైదరాబాద్ వాసులైతే లేక నిన్న రాత్రి గనుక హైదరాబాద్-సికంద్రాబాద్ లో మీరు ఉండి ఉంటే ఉరుములతో కూడిన వర్ష బీభత్సవం చూసి ఉండేవారు.
అయితే నిన్న ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరమంతా అస్తవ్యస్తంగా మారింది. కాని ఇవాళ ఉదయం మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు విరిగిన చెట్ల కొమ్మలని, విద్యుత్తు అంతరాయాన్ని పునరుద్ధరించగలిగారు.
ఇదే విషయాన్ని ప్రముఖ యాంకర్ ప్రదీప్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెబుతూ, ఇంత త్వరగా సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి కృషి చేసిన GHMCకి, నగర మేయర్ కి, అలాగే మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపాడు.