డిసెంబర్ 31న మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకి దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు సంగతి ఇప్పుడు సంచలనంగా మారింది.
అయితే యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డ తరువాత పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్ కి రాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి.
ఇక పోలీసులకి కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాడు అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో ప్రదీప్ నిన్న అర్ధరాత్రి ఒక వీడియో విడుదల చేశాడు. అందులో ఆయన మాట్లాడుతూ - తాను న్యూ ఇయర్ రోజున చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాను అలాగే తనకి ముందుగానే ఒప్పుకున్న షూటింగ్స్ ఉండటం వల్ల పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్ కి రాలేకపోయాను అని తెలిపాడు.
అయితే తాను రూల్స్ ప్రకారం అన్ని ఫాలో అవుతాను అని, త్వరలోనే పోలిసుల ముందు హజరవుతాను అని చెప్పాడు. ఇక తాను మద్యం తాగి వాహనం నడుపకూడదు అని గత సంవత్సరం చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది అని అందులో చెప్పినట్టుగానే ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని కోరాడు.
చివరగా తన వైపు నుండి తప్పు అయితే జరిగింది కానీ, తాను ఎక్కడికి పారిపోలేదు అని త్వరలోనే పోలీసులని కలిసి వారికి సహకరిస్తాను అని చెప్పాడు.