2017 చివరిలో అందరిని ఆశ్చర్యపరుస్తూ విరాట్-అనుష్క లు వివాహం చేసుకోని అందరికి ఒక రకమైన షాక్ ఇచ్చారు. ఇది మరువకముందే ఇప్పుడు మరొక ప్రేమ జంట ఇటువంటి షాక్ నే అందరికి ఇవ్వబోతున్నారు అని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
అదేమనగా- హిందీ హీరో-హీరోయిన్ అయిన రన్వీర్ సింగ్-దీపిక పడుకునేలు ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. గత 5 సంవత్సరాల నుండి వీరివురు ప్రేమలో ఉండగా రేపు దీపిక పడుకునే పుట్టినరోజు సందర్భంగా వీరివురు నిశ్చితార్ధం చేసుకోనున్నారు అన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
ఇక రేపటి రోజు కోసం శ్రీలంక వెళ్ళినట్టు వీరితో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అయతే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన కాని ఫోటోలు కాని బయటకి రాలేదు. మరి ఈ వార్త ఒట్టి పుకారేనా లేక నిజామా అన్నది ఇంకొక రోజు ఆగితే కాని తెలియదు.
మొత్తానికి బాలీవుడ్ లో పెళ్ళిల సీజన్ నడుస్తున్నట్టుగా ఉంది.