హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకోవడంలో అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ డిగ్రీ పట్టా పొందేసిందనాలేమో. పాపం అన్నీ ఉన్నా, అమ్మడికి అవకాశాలు దరి చేరడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎక్స్పోజింగ్ చేసినా కలిసి రావడం లేదు. కానీ, ఎప్పటికో అప్పటికి తానూ మంచి నటిని అనిపించుకుంటాననే కాన్ఫిడెన్స్‌తో ఉంది ప్రగ్యా జైశ్వాల్. అఫ్కోర్స్.. ప్రగ్యా మంచి నటి అని తొలి సినిమాకే ప్రూవ్ చేసేసుకుంది. తనలోని చిన్నా, చితకా లోపాల్ని కూడా తర్వాత అందిన ఒకటీ అరా అవకాశాలతో కవర్ చేసేసుకుంది.
తొలి చిత్రంతో స్కిన్ షోకి దూరమేమో అనిపించినా, ఆ తదుపరి ఆ అనుమానాల్నీ పటాపంచలు చేసేసింది. ఇక మిగిలిందొక్కటే. ఇంకో ఛాన్స్.. సక్సెస్ టేస్ట్ చూసేందుకు. ఆ ఛాన్స్ కోసమే ఈ పాట్లు. చూస్తున్నారుగా, నెట్టింట్లో ఎప్పటికప్పుడే హాట్ హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తుంటుంది అందాల ప్రగ్యా జైశ్వాల్. తాజా పిక్ విషయానికి వస్తే, అందాల బొమ్మ, అపరంజి గుమ్మ అనేలా ఉంది ఈ రెడ్ డ్రస్సులో ప్రగ్యా. చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. రెండు కళ్లూ చాలవనిపిస్తోంది ఈ అందం చూసేందుకు. అల స్వర్గం నుండి ఇల దిగిన దేవతలా దర్శనమిస్తోంది ఈ పోజులో ప్రగ్యా జైశ్వాల్.