మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది.. శతధృవంశ యోధుడు, బాక్సాఫీస్ వీరుడు, రికార్డుల రేడు.. ధియేటర్స్‌లో సందడి చేసేందుకు. ఆయన ఇంకెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి'ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'సైరా' ప్రస్తుతం డీఐ వర్క్ నడుస్తోంది. ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. ఒక్కొక్కరుగా డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా లక్ష్మి పాత్ర పోషిస్తోన్న తమన్నా డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుంది.
మిగిలిన డిజిటల్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా సమాంతరంగా చేస్తున్నారు. రోజుకో అప్‌డేట్ ఇస్తూ, ఒక్కొక్కటిగా వదులుతున్న పోస్టర్స్ రూపంలో ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపుతున్నారు. తెలుగు జాతి మరిచిపోయిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాధగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి'లో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా, ప్రముఖ నటీనటులు భాగం పంచుకున్నారు. నిర్మాణపరమైన విలువలతో పాటు, కాస్టింగ్ పరంగానూ 'సైరా'పై భారీ అంచనాలున్నాయి.
భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'సాహో' నెగిటివ్ రిజల్ట్ అందుకోవడంతో, 'సైరా'పై ఒత్తిడి మరింత ఎక్కువైంది. కానీ, నిర్మాత రామ్‌చరణ్, ఈ సినిమాని మొదలు పెట్టేటప్పుడే బడ్జెట్ లెక్కలు కానీ, లాభ, నష్టాల బేరీజును కానీ దృష్టిలో పెట్టుకోలేదని కన్‌ఫామ్ చేశారు. సో 'సాహో' వేరు, 'సైరా' వేరు. 'సైరా'ని ఓ మంచి సినిమాగానే తీసుకోవాలి. కానీ, కమర్షియల్ కోణంలో అస్సలు చూడకూడదని చిత్ర యూనిట్ అభిప్రాయం.