గ్లామ్‌ షాట్‌: గ్లామర్‌ 'కంచె' దాటించేసిన మేడమ్‌.

మరిన్ని వార్తలు

'కంచె' సినిమాలో 'ఏయ్‌ మిస్టర్‌..' అంటూ క్యూట్‌గా సీత పాత్రలో కనిపించి మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మనసునే కాదు, యావత్‌ తెలుగు రాష్ట్ర కుర్రోళ్లందరి మనుసల్ని దోచేసిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్‌. తొలి సినిమాకే సూపర్‌ హిట్‌ కూడా ఖాతాలో పడేసుకుంది. కుర్రోళ్లనయితే బుట్టలో వేసింది. కానీ, అవకాశాల్ని చేజిక్కించుకోవడంలో మాత్రం బాగా వెనకపడిపోయింది. ఎంట్రీ ఘనంగా ఉన్నా, తదుపరి అవకాశాలు అంతంత మాత్రమే అనిపించుకుంది. ట్రెడిషనల్‌గా ఎంట్రీ ఇచ్చింది కదా.. అని, అలాగే సరిపెట్టేసుకుంటారనుకుందో ఏమో, మెల్ల మెల్లగా గ్లామర్‌ కంచెలు తెంచేసి, తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ అన్నింటినీ పుష్కలంగా ఎగ్జిబిషన్‌కి పెట్టేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Island girl 🏝

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) on

అయినా, పాపం ఈ కంచె పాపను పట్టించుకున్న దాఖలాలే లేకపోయాయి. ఒకటీ అరా సినిమాల్లో నటించినా, అవేమీ పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి ప్రగ్యా జైశ్వాల్‌కి. కానీ, అవకాశాల్ని ఒడిసి పట్టుకునేందుకు తనకు చేతనైనంతలో స్కిన్‌ షో చేస్తూ, సోషల్‌ మీడియాలో పాపులారిటీ పెంచుకుంటూనే ఉంది ప్రగ్యా జైశ్వాల్‌. సదరు స్కిన్‌ షో కార్యక్రమంలో భాగంగా లేటెస్ట్‌గా ఓ బికినీ పిక్‌ని పోస్ట్‌ చేసింది. పింక్‌ హాట్‌ బికినీ ధరించి బీచ్‌లో వయ్యారాలు పోతోంది. కళ్లు చెదిరే ఫిగర్‌ కావడంతో, బికినీ హొయలకు అతికినట్లు సరిపోయింది. ఇంకేముంది ఈ పిక్‌కి దబ్బిడి దిబ్బిడే.. అనేలా పిచ్చ పిచ్చగా కామెంట్స్‌ వచ్చి పడుతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS