ఆషాఢంలో అమ్మాయిలంతా చేతులకు చక్కగా గోరింటాకు పెట్టుకుంటారు. తెలుగమ్మాయిలకీ, ఈ గోరింటాకుకీ విడదీయరాని సంబంధం. మరి నార్త్ ఇండియన్ భామలు కూడా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అయితే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలాగే ఉంటుంది. చూస్తున్నారుగా ప్రగ్యా జైశ్వాల్ చేతులకు అందంగా పండిన ఆ గోరింటాకు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే, అంత మంచి మొగుడొస్తాడని అమ్మలక్కలు చెబుతుంటారు. మరి ప్రగ్యాకి కూడా మంచి మొగుడే వస్తాడేమో. అయినా, మొగుడు సంగతి పక్కన పెడితే, అమ్మడికి ఇప్పుడు ఓ మంచి అవకాశం రావాలి.
అసలు సిసలు హిట్ తెచ్చి పెట్టాలి. అలాంటి ఆఫర్ కోసం ప్రగ్యా ఆరాటపడుతోంది. ఈ ఆరాటమంతా అందుకోసమే. చూస్తున్నారుగా, ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ప్రగ్యా గోరింటాకును ఎలివేట్ చేసేందుకు ఈ ఫోటో సెషన్ చేయించుకోలేదు. ఎప్పటిలాగే తన హాట్ హాట్ అందాల ఎలివేషన్ కోసమే. ఈ బ్లాక్ హాట్ పొట్టి గౌనులో ప్రగ్యా జైశ్వాల్ గ్లామర్ కెవ్వుకేక. మరీ ముఖ్యంగా ఆమె సెన్సువల్ ఎక్స్ప్రెషన్..చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.