బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్టాలెక్కించడానికి ముందే మరో రెండు సినిమాలను బన్నీ అనౌన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో 'ఐకాన్ - కనిపించడం లేదు' ఒకటి కాగా, ఇంకోటి వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్‌తో సినిమా. అయితే, ఈ రెండింటిలో బన్నీ ఏ సినిమాని ముందు పట్టాలెక్కించనున్నాడన్న అనుమానం అందరిలోనూ నెలకొంది.
'రంగస్థలం' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్ చాలా కాలం నుండి తదుపరి సినిమా కోసం వెయిటింగ్లో ఉన్నాడు. వాస్తవానికి మహేష్‌తో సినిమా చేయాలి. కానీ, మహేష్, సుకుమార్‌ని కాదని, అనిల్ రావిపూడికి కమిట్ అవడంతో, సుకుమార్ ఎదురు చూపులు మరింత ఎక్కువయ్యాయి. బన్నీతో సినిమాకి కమిట్మెంట్ ఉన్నప్పటికీ, ఇప్పుడప్పుడే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాల్లేవనుకన్నారంతా. కానీ, సుకుమార్ ఎదురు చూపులకూ, ఫ్యాన్స్ ఎదురు చూపులకూ ఒకేసారి బ్రేక్ వేసేలా ఉన్నాడు అల్లు అర్జున్.
త్వరలోనే సినిమా స్టార్ట్ చేసేద్దామని టీమ్‌కి సూచించాడట. సెప్టెంబర్ 18న ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు బన్నీ - సుకుమార్ అండ్ టీమ్ రంగం సిద్ధం చేస్తోందనీ ఇన్సైడ్ టాక్. మైత్రీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న బన్నీ కసి మీదున్నాడు. ఆ కసితోనే వరుసగా మూడు సినిమాల్ని అనౌన్స్ చేసి, ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నింపాడు. ఇక ఇప్పుడు సుకుమార్ సినిమా పట్టాలెక్కేస్తే ఫ్యాన్స్‌కి అంతకన్నా కావాల్సిందేముంటుంది. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.