'కంచె' సినిమాతో జమీందారీ యువతిగా క్యూట్ అప్పీల్ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్. అదృష్టం కలిసి రావడం లేదు. కానీ కలిసొస్తే అమ్మడు తన గ్లామర్‌తో దుమ్ము దులిపేసేదే. 'కంచె' ఇచ్చిన సక్సెస్ మరో సినిమాతో అందుకోలేకపోయిందీ బ్యూటీ. కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ట్రెడిషనల్ గ్లామర్‌కీ, అల్ట్రా హాట్ గ్లామర్‌కీ కూడా ఇట్టే మ్యాచ్ అయిపోతుంది. ఆల్రెడీ రెండు రకాల గ్లామర్ యాంగిల్స్నీ ఆడియన్స్‌కి పరిచయం చేసేసింది కూడా. హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌కీ సై అనే సంకేతాలు కూడా పంపేసింది. జస్ట్ శాంపిల్‌గా 'జయ జానకీ నాయకా' చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్పెషల్ సాంగ్‌లో తన తళుకు బెళుకు హాట్ సొగసుల్ని రాశిగా ఆరబోసేసింది. తన గ్లామర్ వెనుక రహస్యం ఏంటని అడిగితే ఫిట్నెస్ మంత్రాలు వల్లె వేస్తోంది. అంతేకాదు, ఓ వీడియో ద్వారా హాట్ హాట్ వర్కవుట్స్ చేసి చూపించేసింది. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఆ ఫిట్నెస్కి సంబంధించిందే. గ్రే అండ్ బ్లాక్ ట్రాక్ ప్యాంట్లో స్లీవ్ లెస్ డిజైనర్ టాప్‌తో, పర్పుల్ కలర్ షూస్‌తో ప్రగ్యా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి కొత్త కిక్ ఫీలవ్వండిక.