ఈ ఫోటోలో గుండుతో ఉన్నది ఎవరో గుర్తించారా? ముద్దుగుమ్మ సోనాలీ బింద్రే. ఈ ముద్దుగుమ్మకి క్యాన్సర్ సోకిందన్న విషయాన్ని ఇటీవల తానే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం న్యూయార్క్‌లో క్యాన్సర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటోంది సోనాలీ బింద్రే. తనకు క్యాన్సర్ అన్న విషయం తెలిసినప్పటి నుండీ, ట్రీట్‌మెంట్ విషయాలు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సన్నిహితులు, అభిమానులు తనతో చాలా ఆప్యాయంగా మెలగుతున్నారనీ, ధైర్యమిచ్చే మాటలు, సలహాలు చెబుతున్నారనీ, ఆ విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో పంచుకుంటోంది సోనాలీ బింద్రే. ఆ దిశగానే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఈ ఫోటో పోస్ట్ చేసింది.
క్యాన్సర్ సోకితే, జుట్టు రాలిపోతుందని తెలిసిందే. ట్రీట్‌మెంట్ దశలో ఉన్న సోనాలీకి అదే జరిగింది. కానీ ఏమాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా, పూర్తి గుండుతో ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందరూ తన పట్ల చూపిస్తున్న ఆభిమానానికి కృతజ్ఞతలు చెబుతోంది. ట్రీట్‌మెంట్ చాలా కష్టంగానే ఉంది. కానీ మీరందరూ ఇచ్చే ధైర్యంతో ఆ మహమ్మారిని జయిస్తానని నమ్మకంగా చెబుతోంది. ఎలాగైనా క్యాన్సర్‌ని జయించి, పూర్తి ఆరోగ్యంగా తిరిగొస్తానని చెబుతోంది సోనాలీ బింద్రే.
గతంలో కాన్సర్‌ని జయించి, తిరిగొచ్చి మళ్లీ కెరీర్‌లో మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటోన్న పలువురు సెలబ్రిటీలు తనకు ఆదర్శమనీ సోనాలీ చెబుతోంది. నిజంగా సోనాలీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాం.